భార్యాభర్తలు వార్డు సభ్యులుగా గెలుపు
ఇబ్రహీంపట్నం రూరల్: భార్యాభర్తలు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. భర్తకు ఉప సర్పంచ్ పదవి వరించింది. ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో ప్రజలు వినూత్న తీర్పు ఇచ్చారు. అదే గ్రామానికి చెందిన కావలి వెంకటేశ్, సుధారాణి దంపతులు పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా పోటీలో నిలిచారు. భర్త వెంకటేశ్ 4వ వార్డు సభ్యులుగా, భార్య సుధా 7వ వార్డు సభ్యులుగా బరిలో నిలిచారు. బీఆర్‌ఎస్ ప్యానెల్‌లో ఇద్దరు విజయం సాధించారు. దీంతో భర్త వెంకటేశ్‌కు ఉప సర్పంచ్‌గా అవకాశం వచ్చింది.
మూడు సార్లు వార్డు సభ్యుడిగా గెలిచిన రమేశ్..
ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం గ్రామంలో గొరిగే రమేశ్ 1వ వార్డు సభ్యునిగా పోటీ చేసి గెలుపొందాడు. దీంతో అతను మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు.
భర్తకు ఉప సర్పంచ్‌గా అవకాశం


