అదుపుతప్పి.. గుంతలోకి దూసుకుపోయి
కారు బోల్తా.. వ్యక్తి సురక్షితం
ధారూరు: వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి, బోల్తా పడింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు నుంచి హైదరాబాద్‌కు ఆశిప్ అనే వ్యక్తి.. కారులో అతి వేగంతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో మండల పరిధి గట్టెపల్లితండా బస్‌స్టేజీ సమీపాన రోడ్డు ములుపు వద్ద కారును అదుపు చేయలేక.. సడెన్ బ్రేక్ వేయడంతో కుడి వైపున ఉన్న గుంతలోకి దూసుకుపోయి, చెట్టుకు తగిలి ఆగిపోయింది. కారు నడుపుతున్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. ఇదే విషయమై పోలీసులను వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు అందలేని తెలిపారు.


