ధ్రువీకరణపత్రాలతో నూతన సర్పంచులు
బంట్వారం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యులకు ఆదివారం అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కోట్‌పల్లి మండలంలోని రాంపూర్ సర్పంచ్‌గా డాక నీలమ్మ, ఉప సర్పంచుగా మహబూబ్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కంకణాలపల్లి సర్పంచ్‌గా రాజేందర్‌రెడ్డి, ఉప సర్పంచుగా వినోద్, వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. వీరందరూ రాంపూర్ క్లస్టర్‌లో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. అనంతరం బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వికారాబాద్‌లో 44 వార్డులు ఏకగ్రీవం
అనంతగిరి: వికారాబాద్ మండలంలోని 21 గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 44 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్వెల్లి 10, బురాన్‌పల్లి 6, గోధుమగూడ 3, కొటాలగుడెం 1, కామరెడ్డిగూడ 3, మదన్‌పల్లి 1, మైలార్‌దేవరాంపల్లి 4, నారాయణపూర్ 1, పాతూర్ 2, పీలారం 3, పెండ్లిమడుగు 7, జైదుపల్లి 1, ఎర్రవల్లి 2 వార్డులు ఉన్నాయి. కాగా సర్పంచులు మాత్రం ఏకగ్రీవం కాలేదు. 21 జీపీలో 70 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో ఆదివారం ఉదయమే ప్రచార రంగంలోకి దిగారు. ఇంటింటికి వెళ్లి తమ గుర్తును చూయించి తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతున్నారు.


