స్పీకర్‌ను కలిసిన ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ను కలిసిన ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌

Nov 16 2025 11:12 AM | Updated on Nov 16 2025 11:12 AM

స్పీక

స్పీకర్‌ను కలిసిన ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌

అనంతగిరి: వికారాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నియమితులైన శ్రీనివాస్‌ ముదిరాజ్‌, వైస్‌ చైర్మన్‌ మల్లేశం శనివారం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకే అందజేసి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన స్పీకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్‌, నాయకులు శివయ్య, కరుణాకర్‌రెడ్డి, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

gê¡Ä¶æ$ Ýë¦Æ‡$$ ÝëçßæçÜ ˘

శిబిరానికి విద్యార్థి ఎంపిక

కొడంగల్‌ రూరల్‌: హిమాచల్‌ ప్రదేష్‌లోని ధర్మశాలలో జరగనున్న జాతీయ స్థాయి సాహస శిబిరానికి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి వి.సికిందర్‌ ఎంపికయ్యారు. ఈ నెల 18 నుంచి 27వ తేదీ వరకు సాహస శిబిరం జరగనున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భారత యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి పర్వతారోహణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న సాహస శిబిరానికి కళాశాల విద్యార్థి ఎంపికకావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో ట్రెక్కింగ్‌, రాక్‌ క్‌లైంబింగ్‌, రాపెల్లింగ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, యోగా, శారీరక శిక్షణ, సాంస్కృతిక, పర్యావరణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో జాతీయ సమైక్యత,సామాజిక వికాసం, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ రఫియా ఖానమ్‌, ఐక్యూసీ సమన్వయకర్త టి.రాంబాబు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డా. ఈ సోమ్లా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Möyýl…-VýSÌŒæ yìl{X MýSâê-Ô>-ÌSMýS$ IG‹ÜK çÜÇ-tíœMðSsŒæ ˘

కొడంగల్‌ రూరల్‌: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల శనివారం అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ(ఐఎస్‌ఓ) సర్టిఫికెట్‌ అందు కుంది. సంస్థ ప్రతినిధి శివయ్య కళాశాలలోని వసతులు, బోధన, పరిపాలనా, ప్రయోగశాలల్లో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.శ్రీనివాస్‌రెడ్డికి సర్టిఫికెట్‌ అందించారు. ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ రావడం సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్‌ అన్నారు. కార్య క్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ రఫియాఖానం, ఐక్యూసీ కోఆర్డినేటర్‌ టి.రాంబాబు, అధ్యాపక, ఆధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌లను

సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌రెడ్డి

అనంతగిరి: లోక్‌ అదాలత్‌లలో ఇరువర్గాలు విజయం సాధించినట్లేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ సున్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్‌లోని కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరువర్గాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కేసు నుంచి విముక్తి పొందవచ్చని తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమన్నారు. ప్రతి వ్యక్తికీ చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ కోర్టుల్లో 447 కేసులను పరిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో పలువురు జడ్జిలు, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్పీకర్‌ను కలిసిన ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌ 
1
1/2

స్పీకర్‌ను కలిసిన ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌

స్పీకర్‌ను కలిసిన ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌ 
2
2/2

స్పీకర్‌ను కలిసిన ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement