ఘనంగా మైసిగండి బ్రహ్మోత్సవాలు
కడ్తాల్: మైసిగండి మైసమ్మ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం విశేషపూజలు, అర్చనలు, ప్రత్యేక అలంకరణతో పాటు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సహస్ర చండీయాగం నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్‌రెడ్డి, ఆలయ ఈఓ స్నేహలత, ట్రస్టీ శిరోలీ, తహసీల్దార్ జ్యోతి, నిర్వాహకులు భాస్కర్‌నాయక్, అరుణ్‌కుమార్, యాదగిరి,చంద్రయ్య, శ్రీనివాస్, అర్చక సిబ్బంది అమూల్యపతి, సంతోష్‌శర్మ, భాను ప్రకాశ్ శర్మ పాల్గొన్నారు.


