జల వనరుల సంరక్షణకు సర్వే
అనంతగిరి: నీటి పారుదల శాఖ నుంచి వచ్చిన గణాంకాల ఆధారంగా వనరుల సంరక్షణ, నీటి పారుదల సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. ఈ మేరకు గురువారం తన చాంబర్‌లో 7వ మైనర్ ఇరిగేషన్ సెన్సస్, 2వ సెన్సస్ ఆఫ్ వాటర్ బాడీస్ డిస్ట్రిక్ లెవల్ కమిటీ(డీఎల్‌ఎస్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ ఉపరితల, భూగర్భ జల వనరుల నిర్ధారణ కోసం వ్యూహాలను రూపొందించడానికి దోహద పడుతుందన్నారు. ఈ సర్వేలో జీపీఓ, ఏఈవో, పీఎస్, టీఏ, ఎఫ్‌ఏలు గణనదారులు(గణన చేయువారు)గా, ఏఈఈ(ఇరిగేషన్), ఎంపీఎస్‌ఓలు సూపర్‌వైజర్లుగా, మండల స్థాయి తహసీల్దార్లు చార్జ్ ఆఫీసర్లుగా, మున్సిపల్ కమిషనర్‌లు మున్సిపల్ సెన్సస్ ఆఫీసర్లుగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ మంగీలాల్, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఏఓ రాజరత్నం, డీఆర్‌డీఓ శ్రీనివాస్, డీటీడబ్ల్యూ రవి, ఆయా శాఖల అధికారులు రాంచంద్రయ్య, ఉమేశ్‌కుమార్, సీపీఓ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్


