ఆ పాఠశాలకు టీచర్‌ను నియమించండి
కండ్లపల్లి గ్రామస్తుల వినతి
పూడూరు: తమ పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ పూడూరు మండల పరిధిలోని కండ్లపల్లి గ్రామస్తులు మంగళవారం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డిప్యూటీ డీఈఓకు వినతి పత్రం అందజేశారు. కండ్లపల్లి గ్రామ పాఠశాలలో 61 మంది విద్యార్థులకు ఇద్దరే నెట్టుకొస్తున్నారన్నారు. అందులో ఒకరు బదిలీపై వెళ్లడంతో విద్యార్థులకు సరైన బోధన అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రవి, బాలయ్య, మహబూబ్‌అలీ, రాజు, తదితరులు ఉన్నారు.
పాముకాటుతో
విద్యార్థి మృతి
కుల్కచర్ల: మేకల కాపలాకు వెళ్లిన ఓ విద్యార్థి పాము కాటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన కుల్కచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బొల్లు సిద్దయ్య, యాదమ్మ దంపతుల కుమారుడు గౌతంకృష్ణ(15) సాల్వీడ్ జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్కూల్‌కు వెళ్లకుండా తల్లిదండ్రులతో కలిసి మేకల కాపలాకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాగా అనారోగ్యంగా కనిపించాడు. గమనించిన కుటుంబ సభ్యులు పాము కాటేసి ఉంటుందనే అనుమానంతో కుల్కచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మహబూబ్‌నగర్‌కు రిఫర్ చేయగా, మార్గమధ్యలో చనిపోయాడు.
తాండూరు ఆర్‌ఐగా రాఘవేందర్
తాండూరు రూరల్: తాండూరు ఆర్‌ఐగా రాఘవేందర్ మంగళవారం బాధ్యతలు స్వీ కరించారు. పట్టణంలో ని తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న ఆర్‌ఐ గోపి బదిలీపై కొడంగల్‌కు వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రాఘవేందర్‌ను తాండూరుకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవె న్యూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.
పార్టీకి వ్యతిరేకంగా
మాట్లాడితే చర్యలు
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగప్ప
తాండూరు రూరల్: కాంగ్రెస్‌లో ఉంటు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని తాండూరు మండల అధ్యక్షుడు జెన్నె నాగప్ప మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మండలంలోని మిట్టబాసుపల్లి గ్రామానికి చెందిన కార్యకర్త, మాజీ ఉపసర్పంచు మాల గోవింద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మాల గోవింద్ పోటీ చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా, పోస్టులు పెట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి, ఎక్కడినుంచైనా పోటీచేయొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
పని ఒత్తిడితో
సంతకం చేయలేదు
షాబాద్: తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్టర్‌లో పని ఒత్తిడితోనే సంతకాలు పెట్టలేదని తహసీల్దార్ అన్వర్ తెలిపారు. కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న చేవెళ్లే ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డిలు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారన్నారు. ఆ సమయంలో పరిపాలన విభాగం ఆదేశాలనుసారం హైకోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. పని ఒత్తిడి వల్లే రిజిస్టర్‌లో సంతకం చేయలేదన్నారు.
ఆ పాఠశాలకు టీచర్‌ను నియమించండి
ఆ పాఠశాలకు టీచర్‌ను నియమించండి


