ఆత్మహత్య కారకులను శిక్షించాలి
మంచాల: తమ కూతురి ఆత్మహత్యకు గల కారకులను కఠినంగా శిక్షించాలని మంచాల పోలీస్‌స్టేషన్ ఎదుట ఆరుట్ల గ్రామానికి చెందిన పంబాల నందిని తల్లిదండ్రులు, బంధువులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నందిని(21) ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నారు. దీనికి అదే గ్రామానికి చెందిన మంకు నాగరాజుపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయినా పోలీసులు పట్టించుకోక పోవడంతో స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. పోలీసుల నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు భీష్మించుకున్నారు. సీఐ మధు స్పందించి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటామని, సమాచారం సేకరించి నిందితుడిని చట్టపరంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. దీంతో ధర్నా విరమించారు.
ఆత్మహత్య కారకులను శిక్షించాలి


