
ఘనంగా పథ సంచలన్
చేవెళ్ల: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం పథసంచలన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వయం సేవకులు చేవెళ్లలోని రచ్చబండ నుంచి పురవీధుల మీదుగా కేవీఆర్ గ్రౌండ్ వరకు కవాతు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన వక్త డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. హిందూ సమాజాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గ్రామగ్రామాన స్వయం సేవక్ సంఘ్‌ను విస్తారించాలని, దేశాభివృద్ధే లక్ష్యంగా పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఆర్‌ఎస్‌ఎస్ చేవెళ్ల సంఘ్ చాలక్ బిల్లపాటి కృష్ణారెడ్డి, మైపాల్‌రెడ్డి, మల్లేశ్, కె.వెంకట్‌రెడ్డి, సురేందర్, సాయిరాం, బీజీపీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, డాక్టర్ వైభవ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, పాండురంగారెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు.