
కానిస్టేబుల్‌గా కొనసాగుతూ..
కొత్తూరు: కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే గ్రూప్– 2లో ఉత్తమ ర్యాంకు సాధించి, సెక్రటేరియట్‌లో ఏఎస్‌ఓగా ఉన్నతస్థితికి చేరుకుంది. పట్టణానికి చెందిన గాలిగాని యాదయ్య మూడో కూతురు ఉమ.. చిన్నప్పటి నుంచి చదువుల్లో మేటి. సర్కారు బడుల్లో విద్యనభ్యసించి గ్రూప్– 1, ఎస్‌ఐ, ఉద్యోగానికి పలుమార్లు పరీక్షలు రాసి కొద్దిపాటి మార్కులతో రాణించలేక పోయింది. ఆ తరువాత కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. అయినప్పటికీ.. పట్టువదలక.. పోటీ పరీక్షలు రాసి.. గ్రూప్–2లో మెరిసింది. ప్రస్తుతం ఉమకేశంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది.