
అరకొర బస్సులు.. ప్రయాణికుల పాట్లు
యాచారం: మహాలక్ష్మి పథకం పేరిట ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. కానీ అందుకు తగిన విధంగా సర్వీసుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగి.. అవస్థల నడుమ ఆడబిడ్డలు ఒంటికాలిపై పయనిస్తూ.. ఇబ్బంది పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. పురుషులదీ అదే సమస్య. యాచారం– కందుకూరు రూట్లో సరిగా బస్సులు లేక.. అరకొర బస్సు ట్రిప్పులతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ రూట్లో ఉదయం, సాయంత్రం వేళలోరెండు మండలాల పరిధి గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులతో పాటు అనేక మంది యాచారం మండల కేంద్రం, ఇబ్రహీంపట్నం, నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికులు అధికంగా ఉన్నప్పటికీ.. సంస్థ అధికారులు సర్వీసులు, ట్రిప్పులు పెంచకపోవడంతో ప్రజలు నరక ప్రయాణం చేస్తున్నారు. ఫుట్‌బోర్డు ప్రయాణంతో ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ అధికారులు స్పందించి.. ఈ మార్గంలో అదనపు బస్సులు నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
విధిలేక ఒంటికాలిపై ఆడబిడ్డల పయనం