
సీపీఎస్‌ను రద్దు చేయాలి
అనంతగిరి: ఏ భారం కాని పాత పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకుడు చంద్రకాంత్ కోరారు. శుక్రవారం జిల్లా పర్యటనలో ఉన్న ఏఐఐసీ నాయకుడు సూపర్ సింగ్ ఠాగూర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, చత్తీస్‌గర్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. దీంతో ఆ ప్రాంతాల ఉద్యోగుల భవితకు భద్రత చేకూరిందని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో వెయ్యికి పైగా రిటైర్ అయిన సీపీఎస్ ఉద్యోగులు.. పాత పెన్షన్‌ను తీసుకుంటున్నారన్నారు. తెలంగాణలోనూ అదే విధానాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్, జనరల్ సెక్రటరీ పాషా, రాష్ట్ర సాహిత్య కమిటీ సభ్యుడు మురహరినాథ్, మహబూబ్ నగర్ ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, జిల్లా నాయకులు భాస్కర్, వెంకటయ్య పాల్గొన్నారు