కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Oct 18 2025 9:53 AM | Updated on Oct 18 2025 9:53 AM

కేజీబ

కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

● బీసీ జేఏసీ నాయకులు ● వికారాబాద్‌ పట్టణంలో బైక్‌ ర్యాలీ

అనంతగిరి: వికారాబాద్‌లోని కేజీబీవీలో అసిస్టెంట్‌ కుక్‌– 2, పగలు వాచ్‌మెన్‌–1 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ బాబుసింగ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాలలోపు వారు అర్హులన్నారు. అర్హత కలిగిన వారు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5గంటలలోపు కేజీబీవీలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

స్వీపర్‌ పోస్టులకు

దరఖాస్తుల ఆహ్వానం

దుద్యాల్‌: మండలంలోని చెట్టుపల్లి తండా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కాంట్రాక్ట్‌ పద్ధతిన స్వీపర్‌ ఉద్యోగాల కోసం దర ఖాస్తు చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి రాధిక తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ..పాఠశాలలో రెండు పోస్టులు ఖాళీగా ఉ న్నట్లు తెలిపారు.7వ తరగతి లేదా ఆపై చదు వుకున్న వారు.. 18 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులను పేర్కొన్నారు. ఆసక్తి కలిగి న మండలానికి చెందిన మహిళలు ఈ నెల 22వ తేదీ లోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు సెల్‌ నంబర్‌ 96668 71181లో సంప్రదించాలన్నారు.

నేటి బంద్‌ను

విజయవంతం చేయాలి

అనంతగిరి: బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా శనివారం చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ యాదగిరి యాదవ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం వికారాబాద్‌లో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగార్యాలీ సాగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలన్నారు. వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. రిజర్వేషన్లు సాధించే దాకా ఉద్యమం ఆగదన్నారు. అనంరతం ఆర్‌టీసీ బస్సులు నడపరాదని డీఎంకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బుచ్చిబాబుగౌడ్‌, బొండాల శ్రీనివాస్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లకు

కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది

ఎమ్మెల్యే బీఎంఆర్‌

తాండూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. నేడు (శనివారం) బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సూచనల మేరకు తాము సంపూర్ణ మద్దతు అందిస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సీజేఐపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి

అనంతగిరి: సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడి చేసిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం వికారాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాదనలు వింటున్న ప్రధాన న్యాయమూర్తిపై దాడులు చేయడం సరికాదన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన తెలంగాణ బంద్‌కు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, పుష్పరాణి, సునీతరాములు, ఆనందం, రాజు, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం 
1
1/2

కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం 
2
2/2

కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement