
మహిళల భద్రతకు ప్రాధాన్యత
అనంతగిరి: మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పీఎస్‌ల వారీగా పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించే పూర్తి చేయాలని ఆదేశించారు. కేసుల విషయంలో ఏమైనా సందేహా ఉంటే ఉన్నతాధికారు దృష్టికి తేవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకొని వాటి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇసుక, గుట్కా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన కొడంగల్ కోర్టు ఏపీపీ అభినయి, వికారాబాద్ కోర్టు ఏపీపీ సమీనాబేగం, మహిళా పీఎస్ సీఐ సరోజ, కొడంగల్, నవాబ్‌పేట ఎస్‌హెచ్‌ఓలు, కోర్టు మానిటరింగ్ అధికారులకు సత్కరించి మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు నాయక్, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

మహిళల భద్రతకు ప్రాధాన్యత