
● అప్పాయిపల్లిలోనే భవనాలు నిర్మించాలి ● నిరసన దీక్ష చేప
కళాశాలలు తరలించొద్దు
కొడంగల్: కొడంగల్ మండలానికి మంజూరైన మెడికల్, వెటర్నరీ, యంగ్ ఇంటిగ్రేటెడ్ గురుకులాలను మరో మండాలనికి తరలించాలనే ఆలోచనను విరమించుకోవాలని కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ(కేడీపీ జేఏసీ) నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని అప్పాయిపల్లి నుంచి మెడికల్ కళాశాల నిర్మించే స్థలం వరకు గ్రామస్తులు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు, విద్యావంతులు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడే నిరసన దీక్ష చేపట్టారు. వీరికి కేడీపీ జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొడంగల్ మండలానికి మంజూరైన వాటినితరలించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా వెనకబడిన ఈ ప్రాంతం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో అభివృద్ధిలో పరుగుతు పెడుతుందని భావించామని కానీ కళాశాలలను ఇతర ప్రాంతాలకు తరలించాలనే ఆలోచన నిరాశకు గురిచేస్తోందన్నారు. అప్పాయిపల్లిలోని 19 సర్వే నంబర్ రైతుల దగ్గర నుంచి మెడికల్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలు నిర్మిస్తామని భూమిని తీసుకొని పనులు ప్రారంభిచి, వేరే ప్రాంతానికి తరలిస్తామనడం అన్యాయమని అన్నారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ముందుగా నిర్ణయించిన ప్రాంతాల్లోనే నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు శ్రీనివాస్, యూ రమేష్‌బాబు, భీమరాజు, గంటి సురేష్, మధుయాదవ్, మాజీ సర్పంచు దత్తుసింగ్, మ్యాతరి సంగప్ప, మల్లప్ప, దొబ్బలి పకిరప్ప, గోకుల్‌సింగ్, గుడిసె వెంకటప్ప, దొడ్ల వెంకటయ్య, అమృతప్ప, శీనునాయక్, రాములుగౌడ్, బాల్‌రాజ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.