
అంకిత భావంతో పనిచేస్తేనే గుర్తింపు
బంట్వారం: ఉద్యోగులు అంకిత భావంతో పని చేస్తేనే గుర్తింపు లభిస్తుందని జిల్లా కోపరేటివ్ అధికారి (డీసీఓ) నాగార్జున అన్నారు. సోమవారం బంట్వారం సహకార సంఘం సీఈఓ బ్రహ్మం పదవీ విరమణ చేయడంతో ఆయనకు సంఘం కార్యాలయంలో అభినందన సభ ఏ ర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన డీసీఓ బ్రహ్మం దంపతులను సన్మానించి మా ట్లాడారు. సీఈఓగా బ్రహ్మం సోసైటీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించి మంచి పేరు గడించారన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ సుధాకర్‌గౌడ్, నూతన సీఈఓ శ్రీనివాస్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
సహకారం సంఘం సీఈఓగా శ్రీనివాస్
బంట్వారం: వ్యవసాయ సహకార సంఘం బంట్వారం సీఈఓగా ఎం.శ్రీనివాస్‌కు పదో న్నతి కల్పించినట్లు జి ల్లా కోపరేటివ్ అధికా రి (డీసీఓ) నాగార్జున సోమవారం ఓ ప్రకటన లో తెలిపారు. ఇప్పటి వరకు సీఈఓగా విధులు నిర్వహించిన బ్రహ్మం సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ క్రమంలో అభినందన సభకు హాజరైన డీసీఓ నాగార్జున ఇక్కడే విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌కు బంట్వారం సొసైటీ సీఈఓగా పదోన్నతి కల్పించామన్నారు. రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు.
డీసీఓ నాగార్జున