
ఓపీఎస్‌ను అమలు చేయాలి
అనంతగిరి: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షు డు శివకుమార్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 సీపీఎస్ విద్రోహదినం సందర్భంగా సోమవారం జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. 2024 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ శాపంగా మారిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే సీపీఎస్ విధానాన్ని తొలగించి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అజ్మత్ పాషా, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, కార్యదర్శి సుదర్శన్, ఆర్‌యూపీపీటీఎస్ అధ్యక్షుడు ఎజాజ్ అహ్మద్, టీఆర్‌టీఎఫ్ అధ్యక్షుడు అఫ్జల్, మున్సిపల్ ఉద్యోగుల అధ్యక్షుడు రామకృష్ణ, టీఎన్‌జీఓ, టీజీఓ, నాల్గవ తరగతి ఉద్యోగులు, కార్యవర్గసభ్యులు, ఆయా శాఖల ఉద్యోగ నాయకులు తదితరులు పాల్గొన్నారు.