
‘ఘోష్’.. పొలిటికల్ కమిషన్
అనంతగిరి: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభు త్వం వేసిన ఘోష్ కమిషన్.. పక్కా పొలిటికల్ కమిషన్ అని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా బీఆర్‌ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం పార్టీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నదీ జలాలను పక్కరాష్ట్రాలకు తరలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును బంద్‌చేసే కుట్రలో భాగంగా చర్చలు నిర్వహించడం, కేసును సీబీఐకి అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ–కాంగ్రెస్ కుట్రలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు అశోక్, శేఖర్‌రెడ్డి, మల్లికార్జున్, గోపి తదితరులు పాల్గొన్నారు.