కూలిన ఇంటి పైకప్పు
కుల్కచర్ల: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలిన ఘటన మండలంలోని కుస్మసముద్రం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్లేరి జయలక్ష్మి ఇంటి పైకప్పు బుధవారం కూలిపోయింది. కాగా కుటుంబీకులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
తాండూరురూరల్/ధారూరు/దుద్యాల్/దౌల్తాబాద్/: భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా జనజీవనం అతలాకుతలం అవుతోంది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. బుధవారం తాండూరు మండలంలో కుండపోత వర్షం కురిసింది. బెల్కటూర్–కరన్‌కోట్ మార్గంలో వాగుపై వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో మంగళవారం రాత్రి తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ, కరన్‌కోట్ శివారులో సీసీఐ, తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలు రాకపోకలు నిలిచాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వీడి త్వరగా వంతెన పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
బురదమయంగా గ్రామీణ రోడ్లు
దుద్యాల్ మండల పరిధిలోని ఆలేడ్ గ్రామ శివారులో ఉన్న శ్మశానవాటిక చుట్టూ నీరు చేరడంతో అటుగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే మండలంలోని కుదురుమల్ల, లగచర్ల గ్రామాల్లో రోడ్లపై వర్షం నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో దోమలు ఉత్పన్నమై వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయి. లగచర్ల ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో ఉదయం ప్రార్థన చేయలేకపోతున్నారని విద్యార్థులు అవస్థలు పడ్డారు. అధికారులు స్పందించి రోడ్లలో నీరు నిలువకుండా మరమ్మతులు చేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.
బోర్ల కింద నాట్లు ముమ్మరం
దౌల్తాబాద్ మండలంలో గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఆయా గ్రామాల్లోని చెరువులు పొంగి పొర్లుతున్నాయి. తిమ్మాయిపల్లి గ్రామంలో వర్షానికి పత్తి, పెసర, వరి పంటలు మునిగిపోయాయి. దీంతో రైతన్న ఆందోళన చెందుతున్నారు. బోరుబావుల్లో నీటి మట్టం పెరగడంతో రైతులు బోర్ల కింద వరినాట్లు ముమ్మరం చేశారు.
మునిగిపోయిన బస్టాండ్
భారీ వర్షానికి ధారూరు ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. పైనుంచి వరదనీరు రావడంతో బస్టాండు మునిగిపోయింది. తాండూరు, వికారాబాద్, హైదరాబాద్‌ల నుంచి వస్తున్న బస్సులన్నీ రోడ్డుపైనే ఆగి వెళ్లాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
తాండూరు–కరన్‌కోట్ మధ్య
నిలిచిన రవాణా వ్యవస్థ
బెల్కటూర్ వంతెన పక్కన
కొట్టుకుపోయిన రోడ్డు
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
పలుచోట్ల నీట మునిగిన పంటలు
జలదిగ్బంధంలో చిక్కుకున్న
లోతట్టు ప్రాంతాలు
జోరు వాన.. వెతలు తీరేనా!
జోరు వాన.. వెతలు తీరేనా!
జోరు వాన.. వెతలు తీరేనా!
జోరు వాన.. వెతలు తీరేనా!
జోరు వాన.. వెతలు తీరేనా!
జోరు వాన.. వెతలు తీరేనా!