
వర్షం కురిసే.. రైతు మురిసే
దుద్యాల్: వర్షాకాలం ప్రారంభం నాటి నుంచి అప్పుడప్పుడు పడిన వానలతో రైతులు సాగుకు సమాయత్తం అయ్యారు. సరైన వర్షాలు లేక పంటల ఎదుగుదలకు ఆటంకం ఎదురైంది. ఈ దశలో ఇటీవల కురిసిన వానలు పంటలకు ఊతమిచ్చాయి. జల వనరులు పెరగడంతో పంటలు ఆకు పచ్చని రంగుతో కళకళలాడుతున్నాయి. అన్నదాతలు ఆనందంతో వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. ఆరుతడి పంటలైన పెసర, కంది, బొబ్బర్లు, పత్తి, మొక్కజొన్న వంటి పలు పంటలకు సమృద్ధిగా నీరు అందుతోంది.
జీతాలు ఇప్పించాలని
కలెక్టర్‌కు వినతి
తాండూరు టౌన్: జీతాలు ఇప్పించాలంటూ తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులైన సెక్యూరిటీ గార్డులు, సానిటేషన్ సిబ్బంది తదితరులు బుధవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గత ఐదు నెలలుగా ఏజెన్సీ వారు జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉందన్నారు. వెంటనే జీతాలు చెల్లించేలా ఏజెన్సీ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. నిర్వాహకులు జీతాలు చెల్లించేలా తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
నిష్ణాతులుగా తీర్చిదిద్దుతాం
ఇబ్రహీంపట్నం: గురునానక్ విద్యార్థులను ప్రపంచ స్థాయి ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యాబోధన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆ యూనివర్సిటీ చాన్స్‌లర్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లి అన్నారు. బీటెక్ విద్యార్థుల కోసం సాప్ భాగస్వామ్యంతో రూపొందించిన ఆధునిక కోర్సుల ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ట్రైనింగ్, ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ వినయ్ చోప్రా మాట్లాడుతూ.. ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
రౌడీషీటర్లు నేర ప్రవృత్తి వీడాలి
పహాడీషరీఫ్: రౌడీషీటర్లు నేర ప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనను అలవర్చుకోవాలని మహేశ్వరం డివిజన్ ఏసీపీ జానకీరెడ్డి సూచించారు. బోనాలు, గణేష్ చతుర్థిని పురస్కరించుకొని బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్‌తో కలిసి బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు నేరాలకు దూరంగా ఉండాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, సామాన్యుల పట్ల గూండాయిజం చేస్తే ఉక్కుపాదంతో అణచి వేస్తామని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. రాత్రిపూట రోడ్లపైకి రాకుండా ఇంటి వద్దే ఉండాలన్నారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా వెంటనే పోలీస్‌స్టేషన్‌కు రావాలని పేర్కొన్నారు.

వర్షం కురిసే.. రైతు మురిసే

వర్షం కురిసే.. రైతు మురిసే

వర్షం కురిసే.. రైతు మురిసే