జల పరవళ్లు | - | Sakshi
Sakshi News home page

జల పరవళ్లు

Jul 24 2025 7:02 AM | Updated on Jul 24 2025 7:02 AM

జల పరవళ్లు

జల పరవళ్లు

వికారాబాద్‌: జిల్లాలో రెండు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. మంగళవారం భారీగా పడి బుధవారం కాస్త నెమ్మదించింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు భారీగా నీరు చేరుతోంది. పలుచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గడిచిన రెండు రోజుల్లో తాండూరులో 105.3, దౌల్తాబాద్‌లో 104.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా 9 మండలాల్లో లోటు, 12 మండలాల్లో అధిక వర్షపాతం నమోదయ్యింది. ఒక్క బంట్వారం మండలంలో మాత్రమే లోటు వర్షపాతం కనిపిస్తోంది.

ముందస్తు చర్యలు

జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న సమాచారంతో కలెక్టర్‌, ఎస్పీ అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, పోలీస్‌ సిబ్బందిని సమాయత్తం చేశారు. జిల్లాలో ప్రమాదకర వాగులు, బ్రిడ్జీలు, 50కి పైగా స్థలాలను గుర్తించారు. అక్కడ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వానలు తగ్గే వరకు ఎవరూ బయటికి రావొద్దని, ఉధృతంగా ప్రవహించే వాగులను దాటొద్దని సూచించారు. ప్రమాదకర వాగులు, వంకల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని కోట్‌పల్లి, లఖ్నాపూర్‌, జుంటుపల్లి, శివసాగర్‌, శివారెడ్డిపేట్‌ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి

కాగ్నా, మూసీ, ఈసీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రైతులు పొలాల్లోకి, పాదచారుల ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు.

● ధారూరు మండలం దోర్నాల, రుద్రారం, నాగసముందర్‌, పరిగి, గొడుగోనిపల్లి, గెర్‌గేట్‌పల్లి, ధన్నారం మార్గాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్‌ మండలం గోధుంగూడ రైల్వే అండర్‌ బ్రిడ్జిలో బురద ఇరుక్కుపోవడంతో రాకపోకలు బందయ్యాయి.

● తాండూరు నియోజకవర్గంలో అతి భారీ వర్షం కురిసింది. కగ్నా పరవళ్లు తొక్కుతోంది. బషీరాబాద్‌, యాలాల, తాండూరు మండలాల్లో కగ్నా ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని పలు కాలనీలు జలమయమ్యాయి.

● భారీ వర్షాలకు చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. గండ్లు పడి రాకపోకలు ఆగిపోయాయి. మూసీ పరీవాహక ప్రాంతంలో పంట పొలాలు నీట మునిగాయి.

జిల్లాలో విస్తారంగా వానలు

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

చెరువుల్లోకి చేరుతున్న వరద

కొట్టుకుపోయిన రోడ్లు

పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

పలు కాలనీలు జలమయం

లోటు నుంచి అధిక వర్షపాతం నమోదు

జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం మిల్లీమీటర్లలో..

మండలం పేరు 22వతేదీ 23వ తేదీ స్టేటస్‌

మర్పల్లి 26 1.4 సాధారణం మోమిన్‌పేట్‌ 22 4.9 అధికం

నవాబుపేట 6.4 6 అధికం

వికారాబాద్‌ 14.5 45 సాధారణం

ధారూరు 20 74.7 అధికం

కోట్‌పల్లి 3.6 23.5 సాధారణం బంట్వారం 4.2 17.1 లోటు

పెద్దేముల్‌ 49.9 43.6 సాధారణం తాండూరు 105.3 65 అధికం

బషీరాబాద్‌ 4.8 24.5 సాధారణం యాలాల 71.4 59.4 అధికం

కొడంగల్‌ 76.9 23.8 అధికం

దౌల్తాబాద్‌ 104.8 15.8 అధికం

చౌడాపూర్‌ 39 35 సాధారణం దుద్యాల్‌ 54 20.3 అధికం

పూడూరు 45.1 51.6 అధికం

పరిగి 41.3 56.2 అధికం

కుల్కచర్ల 43.4 24.9 సాధారణం దోమ 67 34.5 అధికం

బొంరాస్‌పేట 39.3 25 అఽధికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement