
విద్యార్థిని ఆత్మహత్య
పరిగి: పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని యాబాజిగూడలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సంతోష్‌కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పద్మమ్మ, జంగయ్యకు ముగ్గురు కూతుళ్లు సంతానం. 13ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో పద్మమ్మ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇదిలా ఉండగా రెండో కూతురు నవీంద్ర (15) రంగారెడ్డి జిల్లా పాల్మాకుల కస్తూర్బాగాంధీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇటీవల స్కూళ్లు పునఃప్రారంభం కావడంతో తల్లి పద్మమ్మ నవీంద్రను హాస్టల్‌లో వదిలి వెళ్లింది. రెండు రోజు రోజుల తర్వాత తల్లికి ఫోన్ చేసిన బాలిక తనకు చదువు ఇష్టంలేదని మారాం చేయడంతో పాటు బాగా ఏడ్చింది. దీంతో ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం స్కూల్‌కు వెళ్లమని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. దీంతో బాలికను మరో స్కూల్‌లో చేర్పించాలనే ఉద్దేశంతో టీసీ తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా పద్మమ్మ గత సోమవా రం ఉదయం తమ బంధువుల గ్రామమైన బస్‌పల్లి కి వెళ్లింది. రాత్రి వచ్చేసరికి నవీంద్ర ఇంట్లో ఉరేసు కుంది. ఇదే గ్రామానికి చెందిన నవీన్‌కుమార్ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ మంగళవా రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
● యాబాజిగూడలో ఘటన
● ఓ యువకుడిపై అనుమానం వ్యక్తంచేస్తూ తల్లి ఫిర్యాదు
● కేసు నమోదు చేసిన పోలీసులు