
బస్సులు ఆపాలని రాస్తారోకో
పూడూరు: హైదరాబాద్– వికారాబాద్ ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నా మండలంలోని అంగడిచిట్టంపల్లి గేటు వద్ద ఎందుకు ఆపడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా విసుగు చెందిన యువజన సంఘాల నాయకులతో కలిసి చిన్నారులు సోమవారం ఉదయం హైదరాబాద్–బీజాపూర్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. బస్‌పాసులు తీసుకుని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కానీ బస్సుల మాత్రం ఇక్కడ ఆపడం లేదని వాపోయారు. ఈ మేరకు విసుగు చెందిన కౌకుంట్ల, అంతారం, అంగడిిచిట్టంపల్లి, చన్గోముల్ గ్రామాలకు చెందిన విద్యార్థులు రోడ్డుపై బస్సులను ఆపి ఆందోళన చేపట్టారు. ఎందుకు ఆపడంలేదని ప్రశ్నించారు. పోలీసులు చేరుకొని ఆర్టీసీ అధికారులతో మాట్లాడడంతో వివాదం సద్దుమణిగింది.
విద్యార్థుల నిరసనతో రోడ్డుపై నిలిచిన వాహనాలు