
చైన్ స్నాచర్ల అరెస్ట్, రిమాండ్
నవాబుపేట: ఇద్దరు చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన బుధవారం నవాబుపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని ఎత్‌రాజ్ పల్లి గ్రామానికి చెందిన మీనపల్లి సత్యమ్మ వారం క్రితం పొలం నుంచి మధ్యాహ్న సమయంలో ఇంటికి వస్తుంది. అదే సమయంలో రాజస్థాన్‌కు చెందిన సేవారాం, దీపారాంలు లూనాపై ఆమె దగ్గరికి వచ్చి ఈ రోడ్డుఎక్కడికి పోతుందని మాటలు కలిపి మెడలోని (40 గుండ్లు గల) బంగారాన్ని అపహరించారు. ఈ విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారు సదశివాపేట వద్ద ఉన్నారనే పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. తామే బంగారు గొలుసును అపహరించినట్లు వారు ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అరుణ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.