
జీపీ కార్మికుల ఆందోళన
జీతాల కోసం
దోమ: పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారి పస్తులుండాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ మెన్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, కారోబార్‌ల ఇదే పరిస్థితి అని వాపోతున్నారు. ప్రస్తుతం మండల పరిధిలో 118 మంది కార్మికులకు ప్రతీ నెల రూ.9,500 వేతనం చెల్లిస్తున్నారు. పెరిగిన ఖర్చుల రీత్యా తమ వేతనాలు పెంచాలని ఓ వైపు డిమాండ్ చేస్తుంటే ప్రస్తుత వేతనం కూడా సమయానికి ఇవ్వక అప్పులపాలు కావాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ నెల రూ.20వేల కనీ వేతనం ఎస్టీఓ ద్వారా చెల్లించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, ప్రమాదబీమాల అలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సీఐటీయూ పిలుపుమేరకు శుక్రవారం నగరంలోని పంచాయతీ రాజ్ కార్యాలయం ముట్టడికి వెళ్లేందుకు జిల్లా కార్మికులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు జీపీ కార్మికులను ముందుస్తు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
మూడు నెలలుగా అందని వేతనాలు
పస్తులుంటున్నామంటూ ప్రభుత్వంపై ఆగ్రహం
పంచాయతీ రాజ్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన సీఐటీయూ
ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు