
సైన్స్ టీచర్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి
యాలాల: మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన సైన్స్ టీచర్ ఖాసీం బీపై పెట్టిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ వెంకటరత్నం, రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి హెచ్‌ఎంతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పాఠ్యాంశ బోధనలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చనిపోయిన జంతువు మెదడును ప్రదర్శించిందన్నారు. ఈ విషయంలో పాఠ్యాంశానికి, పాఠశాలకు సంబంధం లేని వ్యక్తులు ఆందోళన చేసి స్కూల్ వాతావరణాన్ని చెడగొట్టారన్నారు. శాసీ్త్రయ పద్ధతిలో అంకిత భావంతో ప్రయోగాత్మక పద్ధతిలో బోధించే టీచరును సస్పెండ్ చేయడాన్ని వారు తప్పుబట్టారు. ఇది అనాలోచిత చర్యగా వారు పేర్కొన్నారు. ఖాసీం బీ సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తేయాలని వారు కోరారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహులు, కోశాధికారి మూవీస్కాన్, కార్యదర్శులు బాబురావు, సలీం రత్నం, కృష్ణవేణి, వెంకటయ్య, శివరాజ్, మల్లేశం, పరశురాం, భానుచైతన్య, గుడుమియా తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ నేతల డిమాండ్
పాఠశాలను సందర్శించి వివరాల సేకరణ