విద్యార్థులకు అభినందనలు
అనంతగిరి: వివిధ ప్రాంతాల్లోని క్రీడా పాఠశాలలో సీట్లు సాధించిన 9మంది గిరిజన విద్యార్థులను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అభినందించారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఇటీవల వాటర్ స్పోర్ట్స్ అకాడమీ (క్రీడా పాఠశాలలో) బోయినపల్లి, హైదరాబాదు నందు కాయకింగ్, కేనోయింగ్, ఫెన్సింగ్ మొదలైన వాటర్ స్పోర్ట్స్ నందు అడ్మిషన్లు కోసం రాష్ట్ర స్థాయి పరీక్షలు జరిగాయి. జిల్లా నుంచి 9మంది గిరిజన విద్యార్థులు ఎంపికయ్యారు. వారిని అదనపు కలెక్టర్ సుధీర్ అభినందించారు. చదువుతో పాటు వాటర్ స్పోర్ట్స్ విభాగంలో జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీటీడీఓ కమలాకర్ రెడ్డి, విద్యార్థుల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వివేక్‌ను కలిసిన మాజీ వైస్ ఎంపీపీలు
పరిగి: రాష్ట్ర మంత్రి మండలిలో నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి గడ్డం వివేక్‌ను మండల మాజీ వైస్ ఎంపీపీలు మాణిక్యం, సత్యనారాయణ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని మంత్రి సూచించినట్టు వారు తెలిపారు.
రెవెన్యూ సదస్సులతో
భూ సమస్యలకు చెక్
తాండూరు సబ్ కలెక్టర్
ఉమాశంకర్ ప్రసాద్
యాలాల: రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తెలిపారు. బుధవారం మండలంలోని దౌలాపూర్‌లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రైతులు ఇచ్చిన దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దౌలాపూర్‌తో పాటు ముద్దా యిపేటలో నిర్వహించిన సదస్సులో ఆరు దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ వెంకటస్వామి తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆర్‌ఐ వేణు, జూనియర్ అసిస్టెంట్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
‘బాల పురస్కార్’కు దరఖాస్తు చేసుకోండి
జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయసుధ
అనంతగిరి: ప్రధాన మంత్రి బాల పురస్కార్ అవార్డులకు అర్హులై న పిల్లలు దరఖాస్తు చే సుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయసుధ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.వివిధ రంగాల్లో ప్ర తిభ కనబర్చిన బాలలు ప్రధాన మంత్రి రాష్ట్రీ య బాల పురస్కార్ అవార్డు 2025కు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. క్రీడలు, నూతన ఆవిష్కరణలు, సామాజిక సేవ, కళలు, సంస్కృతి, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల్లో ప్రతిభ కనబర్చిన 18 సంవత్సరాల లోపు బా లలు అవార్డుకు అర్హులన్నారు. జూలై 31లోపు హెచ్‌టిటిపిఎస్ //అవార్డ్స్ . జిఓవి. ఇన్‌వెబ్ సైట్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు.
నేడు చెన్నారంలో ట్రాక్టర్ల రివర్స్ డ్రైవింగ్ పోటీలు
యాలాల: మండలంలోని చెన్నారం గ్రామంలో గురువారం ట్రాక్టర్ల రివర్స్ డ్రైవింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు యువ రైతు పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఏరువాక పండుగతో పాటు తన తండ్రి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీల్లో నిర్దేషిత ప్రదేశానికి తక్కువ సమయంలో ట్రాక్టర్‌ను రివర్స్‌లో చేరుకుంటారో వారు విజేతగా నిలుస్తారని తెలిపారు. గెలుపొందిన వారికి నగదు ప్రొత్సాహక బహుమతి ఇవ్వనున్నట్లు రైతు తెలిపారు.
విద్యార్థులకు అభినందనలు
విద్యార్థులకు అభినందనలు


