బాలికతో అసభ్యకర ప్రవర్తన | - | Sakshi
Sakshi News home page

బాలికతో అసభ్యకర ప్రవర్తన

Jun 11 2025 11:57 AM | Updated on Jun 11 2025 11:57 AM

బాలికతో  అసభ్యకర ప్రవర్తన

బాలికతో అసభ్యకర ప్రవర్తన

ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు

తాండూరు రూరల్‌: బాలికతో అసభ్యక రంగా ప్రవర్తించిన ఆ టో డ్రైవర్‌పై పోక్సో కే సు నమోదు చేశారు. కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠ ల్‌రెడ్డి కథనం ప్రకారం.. మంగళవారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(15) తాండూరు పట్టణంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వచ్చింది. పరీక్ష ముగిసిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వెళ్లేందుకు పట్టణంలోని చౌరస్తా వద్ద నిలబడింది. గమనించిన బెల్కటూర్‌ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ ప్రకాష్‌ బాలిక వద్దకు వచ్చి మీ ఊరికే వెళ్తున్నాను ఆటో ఎక్కమన్నాడు. నేను ఒక్కదాన్నే ఆటోలో రానని బాలిక చెప్పింది. మార్గమధ్యలో ప్రయాణికులు ఎక్కుతారని డ్రైవర్‌ నమ్మ బలికాడు. దీంతో ఆటో ఎక్కింది. చిట్టిఘనాపూర్‌ గేటు వద్దకు రాగానే ఆటోను పొలాల్లోకి తీసుకెళ్లాడు. అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కేకలు వేసింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు అక్కడికి చేరుకొని బాలికను రక్షించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆటో డ్రైవర్‌ ప్రకాష్‌ను అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement