
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ● లబ్ధిదారులకు ఇళ్ల మంజూరుపత్రాల అందజేత
పరిగి: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో 320 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. మొదటి విడతలో ఎంపికై న వారికి పథకం మంజూరు పత్రాలు అందజేశామని తెలిపారు. త్వరలో రెండో విడత లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, నాయకులు భీంరెడ్డి, సత్యహరిశ్చందర్ తదితరులు పాల్గొన్నారు.