
ప్రజావాణి అర్జీలను పరిష్కరించండి
అనంతగిరి: ప్రజావాణి కార్యక్రమంలో జనం ఇచ్చి న అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్రతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి హాజరయ్యే జిల్లా అధికారులు సమయపాలన పాటించాలన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం 125 అర్జీలు వచ్చాయని తెలిపారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్