భారీ వర్షానికి తడిసిన ధాన్యం | - | Sakshi
Sakshi News home page

భారీ వర్షానికి తడిసిన ధాన్యం

May 27 2025 7:33 AM | Updated on May 27 2025 7:33 AM

భారీ

భారీ వర్షానికి తడిసిన ధాన్యం

కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల తిప్పలు

తూకం వేయడంలో జాప్యం

యాలాల: ఆరుగాలం శ్రమించిన అన్నదాతల ఆశలపై అకాల వర్షం నీళ్లు చల్లింది. కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చిన ధాన్యం తడిసి అపార నష్టాన్ని మిగిల్చింది. తూకం వేయడంలో జాప్యం కారణంగా పడిగాపులు కాయాల్సి వస్తుందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పేర్కొంటున్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్న అధికారుల మాటలు నీటిమీద రాతలుగా మారాయని ఆరోపించారు.

మొలకెత్తిన వడ్లు

మండలంలో ఎక్కువగా వరి పంటను సాగు చేస్తుంటారు. ఇటీవల డీసీఎంఎస్‌, ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ సమయానికి సంచులతో పాటు తూకాలు, ధాన్యం తరలింపులో జాప్యం జరగడంతో కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాశారు. సోమవారంతోపాటు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బెన్నూరు, రాస్నం, సంగెంకుర్దు, తిమ్మాయిపల్లి, యాలాల, లక్ష్మీనారాయణపూర్‌, అగ్గనూరు, దేవనూరు తదితర కేంద్రాల్లో ధాన్యం తడిసింది. దీనికితోడు పలు కేంద్రాల్లో తేమ కోసం ఆరబెట్టిన ధాన్యం మొలకెత్తింది. ప్రభుత్వ మద్దతు ధర కోసం రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాసిన సకాలంలో తూకం, తరలింపు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యంతో పాటు మొలకెత్తిన వడ్ల విషయంలో ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.

షరతుల్లేకుండా కొనాలి

ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన ధాన్యంతో పాటు మొలకెత్తిన వడ్లను ప్రభుత్వ మద్దతు ధరతో ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి. కేంద్రాల్లో గన్నీ సంచులు, తూకాలు, రవాణా తదితర విషయాల్లో అధికార యంత్రాంగం విఫలమైంది. బెన్నూరు, లక్ష్మీనారాయణపూర్‌, యాలాల తదితర కేంద్రాల్లో రైతుల ధాన్యం పూర్తిగా తడిసి మొలకెత్తింది. యంత్రాంగం స్పందించి షరతులు లేకుండా ఽకొనుగోలు చేయాలి.

– శివకుమార్‌, ఈజీఎస్‌,

స్టేట్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు

నష్టపోతున్న రైతులు

పరిగి: ఇటీవల కురుస్తున్న వర్షానికి కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో మోస్తరు వాన కురిసింది. కల్లాల్లోని ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆలస్యం కావడంతో నష్టపోతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం మాటలు అమలు కావడం లేదని కర్షకులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలులు త్వరితగతిన అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

భారీ వర్షానికి తడిసిన ధాన్యం 1
1/3

భారీ వర్షానికి తడిసిన ధాన్యం

భారీ వర్షానికి తడిసిన ధాన్యం 2
2/3

భారీ వర్షానికి తడిసిన ధాన్యం

భారీ వర్షానికి తడిసిన ధాన్యం 3
3/3

భారీ వర్షానికి తడిసిన ధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement