
పాఠ్య పుస్తకాల పంపిణీ
దౌల్తాబాద్: మండల కేంద్రంలోని ఎంఆర్‌సీ కార్యాలయంలో సోమవారం ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకట్‌స్వామి మాట్లాడుతూ.. మండలంలో అన్ని ప్రభుత్వ, కేజీబీవీ, ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం నుంచి ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిందన్నారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజు ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇప్పటికీ మండలంలో 80శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. మిగతావి కూడా త్వరలో రానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ రామకృష్ణ, సీఆర్‌పీ నారాయణ ఉన్నారు.