
మేకులు కొట్టి.. బ్యానర్లు కట్టి!
ధారూరు: వివిధ ప్రైవేటు కంపెనీలు, షాపుల నిర్వాహకులు రోడ్ల పక్కన ఉన్న చెట్లను ప్రచార సాధనాలుగా వాడుకుంటున్నారు. వీటికి ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్నారు. ఫైబర్, ప్లాస్టిక్, ఐరన్‌తో తయారు చేసిన షీట్లను కొడుతున్నారు. ఇందుకోసం మేకులు వినియోగిస్తున్నారు. దీనిద్వారా మొక్కలు, వృక్షాలు ఎండిపోతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. మనిషి శరీరంలో ఇనుప వస్తువు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుందని, ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోకపోతే క్రమేణా పుండుగా మారుతుందని చెబుతున్నారు. ఇలాగే చెట్లకు కొట్టిన మేకుల కారణంగా వాటికి పుండ్లవంటి గాయాలు ఏర్పడి ఈదురు గాలులకు విరిగిపోతున్నాయని పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బ్యానర్లు, పోస్టర్లు కట్టిన, అతికించిన ఆయా ప్రైవేటు కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రోడ్ల పక్కన చెట్లను ప్రచార సాధనాలుగా వాడుతున్న కంపెనీలు
పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు