
రోడ్డు అంచు.. ప్రమాదపు ఉచ్చు!
బషీరాబాద్: మండల పరిధిలోని నీళ్లపల్లి మైల్వార్ ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డును డబుల్‌గా విస్తరించేందుకు నిధులు మంజూరయ్యాయి. పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్ దారిని ఓ పక్కన తవ్వి వదిలేశాడు. దీంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. ఇక్కడ కనీసం ప్రమాద సూచికలు, రేడియం స్టిక్కర్లు కూడా ఏర్పాటు చేయలేదు. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, అదుపుతప్పినా అంతే సంగతులు. ఇలా ఇప్పటికే పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని, సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
రహదారి విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం
ఆందోళనలో వాహనదారులు