
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
బంట్వారం: రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఎన్నారం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కోట్‌పల్లికి చెందిన సుదర్శన్, విజయలక్ష్మి దంపతులు మోటారు సైకిల్‌పై మర్పల్లి వైపు వెళ్తున్నారు. ఎన్నారం సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇరువురికీ తీవ్రగాయాలయ్యాయి. ఇదే సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ తన కారులో అటుగా వెళ్తున్నారు. గాయపడిన దంపతులను చూసి వెంటనే తన వాహనంలోని మెడికల్ కిట్‌ను తీసి, ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న కోట్‌పల్లి ఎస్‌ఐ అబ్దుల్‌గఫార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను ఆటోలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బైక్ అదుపు తప్పడంతో ఘటన
క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు