
గుండెపోటుతో ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్ మృతి
తాండూరు: ఎకై ్సజ్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పీబీ శ్రీనివాస్(55) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఆయన ఆరేళ్లుగా తాండూరు సర్కిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం సెలవు పెట్టి మహబూబ్‌నగర్‌లోని ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మణికొండ: గుర్తు తెలి యని వాహనం ఢీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోకాపేట ఎగ్జిట్ వద్ద సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. కోకాపేట సెక్టార్ ఎస్‌ఐ మురళీధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోకాపేట ఎగ్జిట్ వద్ద ఓ వ్యక్తి రోడ్డుపై గాయాలతో పడి ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అతడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లు గుర్తించారు. అతని వివరాలు తెలియకపోవటంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.