
పిడుగు పడి గేదె మృతి
యాలాల: పిడుగు పడి ఓ గేదె మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని విశ్వనాథ్‌పూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాములు ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం తన పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. కొంత దూరంలో గడ్డి మేస్తున్న గేదె సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయాన్ని పశువైద్య శాఖ అధికారులకు తెలియజేయడంతో సోమవారం ఘటన స్థలానికి చేరుకొని, పంచనామా నిర్వహించారు. జీవనాధారమైన గేదె మృతితో తనకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.