
భవనం పైనుంచి పడి మేసీ్త్ర మృతి
కుల్కచర్ల: బతుకుదెరువు కోసం వలస వెళ్లిన భవన నిర్మాణ మేసీ్త్ర ప్రమాదవశాత్తు భవనం నుంచి కిందపడి మృతి చెందిన ఘటన కుల్కచర్ల మండలంలో విషాదం నింపింది. స్థానికుల వివరాల ప్రకారం.. గోరిగడ్డ తండా గ్రామపంచాయతీలోని అంతిగానికుంటకు చెందిన టిక్యానాయక్(40) తన భార్య లక్ష్మి, కుమారులు సునీల్, విశాల్‌లతో కలిసి పూణెలోని వర్‌ాధ్యరాంనగర్ ప్రాంతంలో భవన నిర్మాణంలో మేసీ్త్రగా పనిచేసేందుకు 25 ఏళ్ల క్రితం వెళ్లారు. అప్పటి నుంచి గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు టీకీబాబు, బద్రియానాయక్‌ల దగ్గరకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఇటీవల టిక్యానాయక్ అన్నకూతురి పెళ్లికి వచ్చి తిరిగి పూణె వెళ్లారు. ఆదివారం ఉదయం ఆయన 14 అంతస్తుల భవన నిర్మాణంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందారు. ఆర్థిక ప్రగతి కోసం ఉన్న ఊరును వదిలి వెళ్లిన ఆయన విగత జీవిగా రావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.