
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కుల్కచర్ల: నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్న ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు బొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి, దండు రామకృష్ణలు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అనుమతి పత్రాలు అడగ్గా డ్రైవర్లు లేవని చెప్పడంతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.