
గాల్లో వేలాడుతున్న ప్రమాదం
చేవెళ్ల: విచ్చలవిడిగా వెలుస్తున్న హోర్డింగ్‌లు, బ్యానర్లతో ప్రమాదాలు పొంచి ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని షాబాద్ చౌరస్తాలో ఆదివారం ఓ హోర్డింగ్‌కు కట్టిన బ్యానర్ గాలికి చిరిగిపోయి విద్యుత్ హైటెన్షన్ వైర్లపై పడి ఇలా ప్రమాదకరంగా మారింది. ఏ మాత్రం గాలి అధికంగా వీచినా పెను ప్రమాదం సంభవించే ఆస్కారం లేకపోలేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చినిగిపోయిన బ్యానర్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.