
టైలరింగ్‌తో ఉపాధి
పరిగి/ధారూరు: మహిళలు టైలరింగ్ నేర్చుకొని ఆర్థికంగా ఎదగొచ్చని సత్యసాయి సేవా సమితి రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ ఇంచార్జ్ మాధవి పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి సేవా కేంద్రం పరిగిలోని రంగాపూర్‌లో ఉచిత టైలరింగ్ శిక్షణ పొందిన ఐదో బ్యాచ్‌కు మంగళవారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 55 మందికి సర్టిఫికెట్లతో పాటు నిరుపేద కుటుంబాలకు చెందిన ఆరుగురికి కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శిక్షణ తరగతులకు హాజరైన వారికి 65 రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజన సౌకర్యం కల్పించామన్నారు. గ్రామీణ మహిళాలకు ఉపాధి కల్పించేందుకు సంస్థ ఆధ్వర్యంలో నిత్యం కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. టైలరింగ్‌తో ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుందన్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న ప్రతిఒక్కరూ మంచి నైపుణ్యులుగా తయారవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి కన్వీనర్ నాగరాజు, ప్రభాకర్, జిల్లా ఇన్‌చార్జ్ విద్యారాణి తదితరులు పాల్గొన్నారు.
● సత్యసాయి సేవా సమితి
స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌చార్జ్ మాధవి
● నిరుపేద మహిళలకు ఉచితంగా
కుట్టు మిషన్ల అందజేత