
సరిహద్దు మాదే తవ్వకాలు ఆపండి
బొంరాస్‌పేట: ‘ఈ సరిహద్దు భూమి మాదే, మట్టి తవ్వకాన్ని ఆపేయాలి’ అంటూ మండల పరిధిలోని సాలిండాపూర్‌వాసులు మంగళవారం బొంరాస్‌పేట తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ధారూరు మండల సరిహద్దు వద్ద ఉన్న సాలిండాపూర్ సమీపంలోని గుట్ట నుంచి ధారూరు మండలం అంపల్లి గ్రామస్తులు మట్టితవ్వకం పనులు చేపట్టారు. దీనిపై సాలిండాపూర్ గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. తవ్వకాలను నిలిపేయాలని డిమాండ్ చేయడంతో ఇరు గ్రామాల మధ్య గొడవకు దారి తీసింది. దీంతో సీఐటీయూ నాయకులు చొరవచూపి తహసీల్దార్ పద్మావతికి ఫిర్యాదు చేశారు. సరిహద్దు పంచాయితీ తేల్చేవరకు మట్టితవ్వకాల పనులు ఆపేయాని కోరారు. దీంతో ధారూరు మండలం అధికారులతో మాట్లాడిన తహసీల్దార్ పనులను నిలిపివేయించారని సాలిండాపూర్‌వాసులు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యాయుడు బుస్స చంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్‌కు సాలిండాపూర్‌వాసుల ఫిర్యాదు