
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన ఎమ్మెల్యే
పరిగి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణరావు బాధ్యతలు స్వీకరించడంతో శనివారం పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సచివా లయంలో ప్రధాన కార్యదర్శిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేదిశగా ప్రభుత్వంతో కలిసి అడుగులు వేయాలని కోరారు.
బీడీ, డాగ్‌స్క్వాడ్ బృందాల తనిఖీ
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్‌లలో శనివారం బీడీటీం, డాగ్‌స్క్వాడ్ బృందం తనిఖీ చేపట్టారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఈ తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు.
ఎల్మకన్నెలో వ్యక్తి అదృశ్యం
పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
తాండూరు రూరల్:
పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎల్మకన్నె గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన సిరిగిరిపేట్ రవి, స్వాతి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే రవి గత నెల 13వ తేదీన ఎల్మకన్నెలోని ఇంటి నుంచి పనికి వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. భార్య స్వాతి శనివారం కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో భర్త రవి కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు నీలిరంగు ప్యాంట్, గులాబిరంగు షెర్ట్‌ఽ ధరించినట్లు తెలిపింది.
బొలెరో వాహనం బైకు ఢీ
యువకుడి మృతి
మోమిన్‌పేట: బొలెరో వాహనం.. బైకు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మోమిన్‌పేటలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రాళ్లగుడుపల్లి గ్రామానికి చెందిన మొల్లని శుభాష్(30) శుక్రవారం రాత్రి బూరుగుపల్లి నుంచి తన బైకుపై స్వగ్రామానికి వస్తున్నాడు. అదే సమయంలో కల్లు సరఫరా చేసే బొలెరో వాహనం వేగంగా వచ్చి రాళ్లగుడుపల్లి నుంచి ఎదురుగా వస్తున్న బైకును ఢీ కొట్టింది. బైకు నుజ్జు నుజ్జయి తలకు బలమైన గాయం అవ్వడంతో శుభాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకొన్న మృతుని తండ్రి మొల్లని నర్సయ్య శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించా రు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డ్రైవరు తుకరాంను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ అరవింద్ పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన ఎమ్మెల్యే

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన ఎమ్మెల్యే

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన ఎమ్మెల్యే