నేడు కరన్‌కోట్‌కు ఎస్పీ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు కరన్‌కోట్‌కు ఎస్పీ రాక

Mar 17 2025 9:30 AM | Updated on Mar 17 2025 9:30 AM

నేడు

నేడు కరన్‌కోట్‌కు ఎస్పీ రాక

తాండూరు రూరల్‌: మండల పరిధిలోని గౌ తపూర్‌ సమీపంలో ఉన్న కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌కు సోమవారం జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి వస్తున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాండూరు మండలంలోని గౌతపూర్‌ నుంచి కోత్లాపూర్‌, గౌతపూర్‌ చౌరస్తా నుంచి ఓగిపూర్‌ వరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభిస్తారని తెలిపారు.

ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

దోమ: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలర్చుకోవాలని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం దోమ మండల పరిధిలోని మైలారం గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలంతా భక్తిభావంతో మెలగాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

భారతి సిమెంట్‌

అల్ట్రాఫాస్ట్‌ విడుదల

సంస్థ టెక్నికల్‌ ఇంజనీర్‌ సామ్రాట్‌

అనంతగిరి: తెలంగాణ రాష్ట్రంలో భారతి సిమెంట్‌ అల్ట్రాఫాస్ట్‌ పేరుతో ఫాస్ట్‌ సెటింగ్‌ సిమెంట్‌ 5 స్టార్‌ గ్రేడ్‌ను ఆదివారం విడుదల చేశారు. వికారాబాద్‌లోని శ్రీగురుకృపా ఏజెన్సీస్‌ డీలర్‌ షాప్‌లో నిర్వహించిన తాపీ మేసీ్త్రల సమావేశంలో సంస్థ టెక్నికల్‌ ఇంజనీర్‌ సామ్రాట్‌ ప్రసంగించారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్‌తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందన్నారు. అల్ట్రాఫాస్ట్‌తో బ్రిడ్జిలు, పిల్లర్లు, స్లాబ్‌లు, రహదారులకు సరైన ఎంపికవుతుందన్నారు. అల్ట్రాఫాస్ట్‌ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందిస్తామని, స్లాబ్‌ కాంక్రీట్‌ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్‌ ఇంజనీర్లు సైట్‌ వద్దకు వచ్చి సహాయపడతారని ఆయన సూచించారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్‌లకన్నా కేవలం రూ. 20 ఎక్కువ ఉంటుందని, నాణ్యతను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీలర్‌ జగదీశ్‌, భారతి సిమెంట్‌ టెక్నికల్‌ బృందం సభ్యులు పాల్గొన్నారు.

అదృశ్యమైన వ్యక్తిమృతదేహం లభ్యం

ఇబ్రహీంపట్నం: కనిపించకుండా పోయిన యువకుడి మృతదేహం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో లభ్యమైంది. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న సింగారం మధు(24), శుక్రవారం నుంచి కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద కుటుంబీకులు ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో తండ్రి జ్ఞానేశ్వర్‌ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం స్థానిక పెద్ద చెరువు తూము వద్ద మధు చెప్పులు, పర్సు, ఐడీ కార్డు, సెల్‌ఫోన్‌ను స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. డీఆర్‌ఎఫ్‌ బృందం చెరువులో గాలించి మధు మృతదేహాన్ని వెలికితీశారు. అవివాహితుడైన యువకుడి మరణానికి కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మృతుడు రెండు నెలలుగా విధులకు హాజరు కావడంలేదని మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రసాగర్‌ తెలిపారు.

నేడు కరన్‌కోట్‌కు ఎస్పీ రాక 1
1/2

నేడు కరన్‌కోట్‌కు ఎస్పీ రాక

నేడు కరన్‌కోట్‌కు ఎస్పీ రాక 2
2/2

నేడు కరన్‌కోట్‌కు ఎస్పీ రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement