తాండూరు: తాండూరులో గాజు గ్లాసు ముక్కలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీ పొత్తులో భాగంగా తాండూరు స్థానాన్ని జనసేన పార్టీకి చెందిన నేత నేమూరి శంకర్‌గౌడ్‌కు కేటాయించారు. బీజేపీ మద్దతు లభిస్తోందని ఎంతో ఆశతో వచ్చిన శంకర్‌గౌడ్ నామినేషన్ వేసి ఎన్నికల ప్రచారంలోకి దిగారు. అయితే బీజేపీ మద్దతు అంతంత మాత్రంగానే లభించింది. గతంలో తాండూరు నుంచి బీజేపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా 10 వేలకు పైచిలుకు ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలలో మాత్రం బీజేపీ శ్రేణులు జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో నేమూరి శంకర్‌గౌడ్‌కు కేవలం 4,087 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో జనసేన డిపాజిట్ కోల్పోయింది.
ఏనుగుకు దూరంగా బహుజనులు
గత రెండేళ్లుగా తాండూరు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ విస్తృతంగా పర్యటిస్తు వచ్చారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలంగా మార్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే బహుజన సమాజ్ పార్టీకి బహుజనుల మద్దతు అనుకూలిస్తోందని ఎంతో ఆశపడ్డారు. అయితే కౌంటింగ్ రోజు మాత్రం బీఎస్పీ నాయకులు ఆశించిన స్థాయి ఫలితాలు రాలేదు. కేవలం 2,546 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. స్థానికుడు అయిన బీఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ కంటే స్థానికేతరుడైన జనసేన పార్టీ అభ్యర్థికి అధికంగా ఓట్లు రావడం విశేషం.
తాండూరులో డిపాజిట్ కోల్పోయిన
జనసేన