
శివకుమార్ (ఫైల్)
అబ్దుల్లాపూర్‌మెట్: ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు అదృఽశ్యమైన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన ఈజమల్ల రాంకోటి కుమారుడు శివకుమార్ (24) నగరంలో సీసీ కెమెరాల పని నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 15న ఇంటి నుంచి వెళ్లిన శివకుమార్ తిరిగి రాలేదు. గతంలోనూ ఇదే మాదిరిగా వెళ్లిన శివకుమార్ రెండు నెలల తర్వాత ఇంటికి వచ్చాడు. ఈ సారి రాకపోవడంతో అతని ఆచూకీ కోసం కుటుంబసభ్యులు వాకబు చేయగా ఫలితం లభ్యమవ్వలేదు. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో ఆందోళనకు గురైన శివకుమార్ తండ్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
మెజార్టీ పెరుగుతూ వచ్చి.. స్వల్ప తేడాతో గట్టెక్కి
మొయినాబాద్: చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట్లో ఆయన మెజార్టీ పెరుగుతూ వచ్చింది. అయితే మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థి భీంభరత్‌కు లీడ్ ఇచ్చాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి యాదయ్యకు
నవాబ్‌పేట్ మండలంలో 1,966 ఓట్ల మెజార్టీ, శంకర్‌పల్లి మండలంలో 5000 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి భీంభరత్‌కు మొయినాబాద్ మండలంలో 1,760 ఓట్ల మెజార్టీ, షాబాద్ మండలంలో 1,564 ఓట్ల మెజార్టీ, చేవెళ్ల మండలంలో 2,100 ఓట్ల మెజార్టీ వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థికి 575 ఓట్ల లీడ్ వ చ్చినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి విజయాన్ని అందుకోలేకపోయారు. శంకర్‌పల్లి మండలంలో యాదయ్యకు ఏకంగా 5000 ఓట్ల ఆధిక్యం రావడంతో చివరికి 268 ఓట్లతో గట్టెక్కారు.