రైతు వెంటే సీఎం కేసీఆర్‌ | - | Sakshi
Sakshi News home page

రైతు వెంటే సీఎం కేసీఆర్‌

Apr 1 2023 5:46 AM | Updated on Apr 1 2023 5:46 AM

రూ.5 భోజనం వడ్డిస్తున్న మహేశ్‌రెడ్డి తదితరులు - Sakshi

రూ.5 భోజనం వడ్డిస్తున్న మహేశ్‌రెడ్డి తదితరులు

పరిగి: రైతుల సమస్యలను పరిష్కరించడంతో సీఎం కేసీఆర్‌ ఎల్లప్పుడు ముందంజలో ఉంటారని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో శుక్రవారం హరే క్రిష్ణా మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రూ.5కే అన్నపూర్ణ భోజనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం కోసం సీఎం అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత కరెంట్‌ పథకాలు చరిత్రాత్మకంగా నిలుస్తున్నాయని స్పష్టంచేశారు. పండించిన ప్రతీ పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టంచేశారు. పరిగి మార్కెట్‌కు వచ్చే రైతులు తిండి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో రూ.5కే మంచి భోజనం అందిస్తున్నామన్నారు. రైతులు సేదతీరేందుకు త్వరలోనే విశ్రాంతి భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. మార్కెట్‌ యార్డులో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌కుమార్‌, జెడ్పీటీసీ హరిప్రియ, హరేక్రిష్ణా మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస్‌, సీఈఓ కౌంతియాదాస్‌, ఉపాధ్యక్షుడు మహావిష్ణుదాస్‌, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ రాజేందర్‌, కౌన్సిలర్లు, మార్కెట్‌ కమిటీడైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంట్‌ పథకాలు చరిత్రాత్మకం

గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్‌ వన్‌

ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

పరిగి మార్కెట్‌లో రూ.5 భోజనం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement