తాండూరు: పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు భవనాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని శాంతినగర్ పార్కు పక్కన ఉన్న మున్సిపల్ భవనం గతంలో ఈ సేవ కేంద్రం నిర్వహణకు ఉపయోగించారు. ఈ సేవ కేంద్రాలను ఎత్తేయడంతో ఏళ్లుగా వృథాగా ఉంది. గతంలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు భవనం కేటాయించాలని పోలీసు అధికారులు విన్నవించారు. ఈ విషయంపై కౌన్సిల్ సమావేశంలో సభ్యుల ఆమోదం పొందింది. శుక్రవారం శాంతినగర్‌లో ఉన్న భవనాన్ని పోలీసు శాఖకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులను తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డిలకు అందించారు. మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ అశోక్‌కుమార్, అధికారులు శాంతినగర్‌లోని భవనాన్ని సందర్శించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు అనుగుణంగా మార్చుకునేందుకు పనులు ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
భవనాన్ని కేటాయించిన మున్సిపల్ అధికారులు