
పరిగి: ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ కేంద్రంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దోమ మండల కేంద్రానికి చెందిన వారాల రాజ్‌కుమార్(55) స్థానికంగా టీ హోటల్ పెట్టుకుని జీవిస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్‌కుమార్ ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. వికారాబాద్‌కు వెళ్తున్న శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు రాజ్‌కుమార్‌ను ఢీకొట్టింది. దీంతో రాజ్‌కుమార్ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ప్రభావతి, కుమారుడు, కూతురు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు ఆర్థికసాయం అందజేశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇద్దరి బైండోవర్
పెద్దేముల్: తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి ఎదుట ఎకై ్సజ్ పోలీసులు శుక్రవారం ఇద్దరిని బైండోవర్ చేశారు. మండల పరిధిలోని పాషాపూర్ తండాలో శుక్రవారం ఎకై ్సజ్ పోలీసులు దాడులు చేశారు. తండాకు చెందిన ధనావత్ రవి ఇంట్లో రెండు లీటర్ల బెల్లం ఊట లభించింది. దీంతో బెల్లం స్వాధీనం చేసుకొని ధనావత్ రవితో పాటు ఆయన భార్య కమ్లిబాయిని అదుపులోకి తీసుకొని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. దాడుల్లో ఎస్‌ఐ చంద్రకాంత్, రమేశ్, భీమయ్యతో పాటు తదితరులు ఉన్నారు.
ఆర్‌ఎంపీ డాక్టర్‌పై కేసు
ధారూరు: మండల పరిధిలోని నాగారం గ్రామంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్న జె. నాగేశ్‌పై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. ఆర్‌ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వల్లే తన తల్లి మృతి చెందిందని కుమారుడు విస్లావత్ చంటి ఫిర్యాదు చేశారని ఆయన వివరించారు. ఈ మేరకు ఆర్‌ఎంపీ డాక్టర్‌పై కేసు నమోదు చేశామన్నారు. ఆర్‌ఎంపీ డాక్టర్ పరారీలో ఉన్నారని, త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.
108లో ప్రసవం
కుల్కచర్ల: 108లో మహిళ ప్రసవించింది. చౌడాపూర్ మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి ప్రసవ నొప్పుల రావడంతో వెంటనే 108ను సంప్రదించారు. 108 సిబ్బంది గర్భిణీని కుల్కచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువస్తున్న క్రమంలో నొప్పులు అధికం కావడంతో 108లోనే సుఖ ప్రసవాన్ని నిర్వహించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఈఎంటీ వినోద్‌కుమార్ తెలిపారు.
బైక్ అదుపుతప్పి ఒకరి మృతి
ధారూరు: బైక్ అదుపుతప్పిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన మండల పరిధిలోని నాగసమందర్ గ్రామ రైతువేదిక సమీప రోడ్డుపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాగసమందర్‌కు చెందిన సయ్యద్ అమీరొద్దీన్ తన సోదరిని రైలు ఎక్కించేందుకు బైక్‌పై తాండూరు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రైతువేదిక సమీపంలో కుక్కలు అడ్డు రావడంతో అదుపుతప్పి కిందపడగా తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు వెంటనే క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ తెలిపారు. భార్య అబ్రిన్‌బేగం ఫిర్యాదు మేరకు కేసు దార్యప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రాజ్‌కుమార్ మృతదేహం

అమీరొద్దీన్ (ఫెల్)