● ఊపిరితిత్తుల సమస్యలతో మంచానికే పరిమితం ● ఆపరేషన్‌కు రూ.32 లక్షలు అవుతుందన్న వైద్యులు ● దాతల సహాయం కోసం వేడుకోలు | - | Sakshi
Sakshi News home page

● ఊపిరితిత్తుల సమస్యలతో మంచానికే పరిమితం ● ఆపరేషన్‌కు రూ.32 లక్షలు అవుతుందన్న వైద్యులు ● దాతల సహాయం కోసం వేడుకోలు

May 20 2026 12:11 AM | Updated on May 20 2026 12:11 AM

● ఊపిరితిత్తుల సమస్యలతో మంచానికే పరిమితం ● ఆపరేషన్‌కు రూ.32 లక్షలు అవుతుందన్న వైద్యులు ● దాతల సహాయం కోసం వేడుకోలు

వెంకటగిరి రూరల్‌: మా అమ్మను బతికించండి సా రూ అని బాధితురాలి కుమారుడు అబ్దుల్‌ రహీమ్‌, కుమార్తె సనా వేడుకుంటున్నారు. పట్టణంలోని బంగారుపేటకు చెందిన షేక్‌ మస్తాన్‌బాషా, మమూల్‌బేగంది ఒకప్పుడు చేనేత కుటుంబం. చేనేత మగ్గంపై చాలీచాలని కిరాయి వస్తుండడంతో మస్తాన్‌ సైకిల్‌పై కూరగాయలు విక్రయించే వ్యాపారం ప్రారంభించారు. తద్వారా వచ్చిన నగదుతో భార్య మమూల్‌బేగంతోపాటు, ఒక కుమారుడు అబ్దుల్‌ రహీమ్‌, కుమార్తె సనాను పోషించుకుంటున్నారు. అయితే రెండేళ్ల కిందట మమూల్‌బేగం అనారోగ్యానికి గురైంది. స్థానిక వైద్యశాలలో పరీక్షలు చేయించడంతో ఊపిరితిత్తుల సమస్య ఉందని, మందులు వాడితో సరిపోతుందని వైద్యులు సూచించారు. సుమారుగా రెండేళ్లపాటు వైద్యం కోసం మస్తాన్‌ రూ.లక్షలు ఖర్చు చేశారు. అయినప్పటికీ మమూల్‌బేగానికి వ్యాధి నయం కాకపోవడంతో చైన్నెలోని ఓ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి, ఊపిరితిత్తులకు ఐఎల్‌డీ వ్యాధి సోకిందని, సకాలంలో ఊపిరితిత్తుల మార్పిడి చేసుకోవాలని, ఇందుకు రూ. 32 లక్షలు ఖర్చు అవుతందని తెలియజేసినట్లు బాధితులు తెలిపారు. ఇప్పటికే వైద్య పరీక్షల కోసం ఉన్న ఒక్క ఇల్లు విక్రయించడంతోపాటు, బంధువులు, తెలిసిన వారి వద్ద సుమారుగా రూ.8 లక్షల వరకు అప్పు తీసుకుని ఖర్చు చేశామని, ప్రస్తుతం తమకు ఉండేందుకు ఇల్లు కూడా లేకుండా అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు తెలిపారు. మమూల్‌బేగంకు వైద్యం చేయించడానికి నగదు లేక సుమారు 5 నెలల నుంచి ఇంట్లోనే పెట్టుకుని ఉన్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాతల సహాయంతో ఆక్సిజన్‌ యంత్రాన్ని తెప్పించుకుని, ఇంట్లోనే ఆక్సిజన్‌ పెట్టి, చూసుకుంటున్నామన్నారు. ఈ తరుణంలో మనస్సున్న మా రాజులు తమ తల్లికి వైద్యం చేయించి, ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్ధలు, మానవతవాదులు, పాలకులు స్పందించి తమ తల్లికి ఆపరేషన్‌కు సరిపడా నగదు ఫోన్‌ పే నంబర్‌ 76619 07780 అందించి తమ తల్లికి ప్రాణబిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement